డ్రీమర్స్ కు శుభవార్త!
డ్రీమర్లుగా పిలువబడుతున్న అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ శుభవార్త చెప్పారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వేలాది మంది డ్రీమర్లకు పౌరసత్వం కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం ఇమిగ్రేషన్ ప్లాన్‌ను తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రానున్న 12 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్‌పై తయారు చేసే నూతన చట్టం ఉభయసభల్లోనూ ఆమోదం పొందుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, మెక్సికో మధ్య సరిహద్దు కోసం సుమారు 25 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే డ్రీమర్స్‌కు పౌరసత్వం కల్పించాలన్న అంశం పరిశీలనలో ఉన్నట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.













