ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లకు ట్రంప్ ఝలక్
ప్రస్తుతం కెనడాలో నివశిస్తున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు అమెరికాకు వస్తే వారి భద్రతా ఖర్చులను తమ ప్రభుత్వం చెల్లించే ప్రసక్తేలేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నేను యునైటెడ్ కింగ్డమ్, ఆ దేశ రాణికి మంచి స్నేహితుడిని. వారిపై నాకు ఎంతో అభిమానం ఉంది. రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిపింది. ఇప్పుడు వారు కెనడా నుంచి యూఎస్‌కు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హ్యారీ దంపతులు యూఎస్ వస్తే వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి అని ట్రంప్ పేర్కొన్నారు.













