డొనాల్డ్ ట్రంప్ మరో ప్రతిపాదన …తిరస్కరించిన డెమోక్రాట్లు
అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కారణంగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం తాను డిమాండ్ చేస్తున్న నిధులను కేటాయిస్తే, సరైన పత్రాల్లేకుండానే అమెరికాలోకి ప్రవేశించిన డ్రీమర్లు, మరికొంతమంది వలసదారులకు ఉపశమనం కల్పిస్తానని ప్రతిపాదించారు. దేశం నుంచి వెంటనే బయటకు పంపకుండా వారికి తాత్కాలిక రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఆయన ప్రతిపాదనను డెమోక్రాట్లు తిరస్కరించారు.













