ఆన్లైన్ చర్చలో పాల్గొనను : ట్రంప్
వచ్చే వారం అమెరికా అధ్యక్ష, అభ్యర్థుల మధ్య జరగనున్న చర్చ ఈసారి ఆన్లైన్ ద్వారా జరుగుతుందని డిబేట్ వ్యవహారాలను పర్యవేక్షించే కమిషన్ తెలిపింది. ట్రంప్, బిడెన్లు వారి వారి ప్రదేశాల్లోనే వుంటారని, ఓటర్లు, మోడరేటర్ మాత్రం మియామిలోని చర్చావేదిక నుండి ప్రశ్నలు అడగవచ్చని పేర్కొంది. ట్రంప్‌కు కరోనా వచ్చిన నేపథ్యంలో ఈ మార్పులు జరాగాయి. ఈ బిడెట్ టౌన్‌హాల్ తరహా చర్చల్లో సాగుతుందని కమిషన్ పేర్కొంది. అయితే ఆన్లైన్లో సాగే చర్చలో పాల్గొనడానికి తాము సుముఖంగా లేనని ట్రంప్ చెప్పారు. ఆ చర్చకు హాజరు కాదలచుకోలేదని ఆయన మీడియాతో అన్నారు. తన ప్రతర్థి బిడెన్‌ను కాపాడేందుకు కమిషన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు. కరోనా కారణంగా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. ఇప్పటికీ ఆయన కరోనాతో బాధపడుతున్నా అక్టోబరు 15 నాటికి చర్చలో ట్రంప్ పాల్గొంటారని ఆయన తరపున బృందం చెబుతోంది.













