కీలక మార్పులకు ట్రంప్ సిద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యంత్రాంగంలో భారీ మార్పులు చేర్పులకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారుడు (ఎన్ఎస్ఎ) హెచ్ఆర్ మెక్‌మాస్టర్‌ను తొలిగించాలని ట్రంప్ నిర్ణయించినట్లు, ఇతర కీలక పదవులలో కూడా మార్పులకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడైంది. అధికార యంత్రాంగంలో ట్రంప్ ఆపరేషన్‌పై వాషింగ్టన్ పోస్టు ప్రధాన వార్తను ప్రచురించింది. ఎన్ఎస్ఎ వైఖరి పట్ల ట్రంప్ అసంత ప్తిగా ఉన్నారు. అయితే ఈ ఉన్నతాధికారిపై వేటు వేధింపు చర్యగా మారరాదని, తగు వారసుడిని ఎంచుకున్న తరువాత నిర్ణయాన్ని అమలు పర్చాలని ట్రంప్ భావిస్తున్నట్లు పత్రిక తెలిపింది.













