సైన్యాన్ని రంగంలోకి దింపుతానన్న ట్రంప్
పోలీసుల అదుపులో ఉన్న నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ ఐ కాంట్ బ్రీత్ నిరసనలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక భవనం వైట్‌హౌస్ ఎదుట శాంతియూత ఆందోళనలు చేపడుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువును ప్రయోగించారు. ఇప్పటికే అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో ట్రంప్ మాట్లాడుతూ అల్లర్లను అదుపు చేయడంలో గవర్నర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ శాంతి, భద్రతలను కాపాడటం తన కర్తవ్యమని, అందుకు తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. తక్షణమే నేషనల్ గార్డస్ను రంగంలోకి దింపాలని గవర్నర్లను ఆదేశించారు. లేకుంటే ఆందోళనకారులను అడ్డుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వస్తుందని హెచ్చరించారు.













