భారతీయులకు హెచ్-1 బీ చిక్కులు
అమెరికా వీసా విధానాల్లో కఠిన నిబంధనలు భారతీయులను అయోమయంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా హెచ్-1 బీ వీసా విధానంలో చిక్కులు మరింత పెరిగాయి. 2017 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో అధిక భాగం భారతీయులవే కావడం గమనార్హం. వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ)నివేదికలోని వివరాల ప్రకారం, వీసా దరఖాస్తులకు తగిన ఆధారాలు సమర్పించాలని ఇతర దేశాల పౌరుల కన్నా భారతీయులనే అమెరికా అధికారులు ఎక్కువగా కోరుతున్నారు. సుమారు 72 శాతం భారతీయ దరఖాస్తుదారులకు ఇలాంటి విజ్ఞప్తులు వెళ్లగా, ఇతర దేశాల పౌరుల్లో మాత్రం 61 శాతం మందికి ఆ నోటీసులు పంపినట్టు పేర్కొంది.













