భారతీయ అమెరికన్ కు కీలక పదవి
అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. రిటా బరన్వాల్ అనే భారతీయ అమెరికన్‌ను ఎనర్జీ విభాగంలోని అణుశక్తిశాఖ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు. ఈమెను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేయడం విశేషం. అమెరికా ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే ట్రంప్ ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. అణు శాస్త్రంలో నిపుణురాలైన భారతీయ అమెరికన్ రీటాను విద్యుత్‌శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు.
ప్రస్తుతం బరన్వాల్ గేట్‌వే ఫర్ అక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (జీఏఐఎన్)లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు ఎనర్జీ విభాగా అసిస్టెంట్ సెక్రటరీగా నియమించే ట్రంప్ ప్రతిపాదనను సెనెట్ ఆమోదించాల్సి ఉంది. అనంతరం ఆమెకు అణు సాంకేతికత పరిశోధన, అభివృద్ధి, నిర్వహణ వంటి అదనపు బాధ్యతలూ దక్కుతాయి. మెటీరియల్స్ సైన్స్, ఇంజీనీరింగ్లో ఎంఐటీ (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి బరన్వాల్ పట్టా పొందారు. మిచిగన్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఎంఐటీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్, బార్క్లీ అణు ఇంజినీరింగ్ విభాగాల సలహాదారుల బోర్డులో గతంలో సేవలందించారు.













