మెక్సికో సరిహద్దులో మోహరిస్తాం : ట్రంప్
అమెరికా, మెక్సికో సరిహద్దులో సైన్యాన్ని మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. సరిహద్దులో గోడ నిర్మించే వరకు అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో బాల్టిక్ దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడుతూ మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేవరకు సైన్యాన్ని మోహరించాలనే అంశం గురించి రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాటిస్‌తో చర్చించానని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని ట్రంప్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.













