ట్రంప్ నోట మళ్లీ మధ్యవర్తిత్వం మాట
భారత్-చైనాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి రెండు దేశాలకూ సమాచారం కూడా ఇచ్చానని ట్వీట్ చేశారు. సరిహద్దులకు సంబంధించి నెలకొన్న వివాదాలను తాను పరిష్కరించగలనని తెలిపారు. అమెరికాకు ఆశక్తి ఉందన్నారు. చివర్లో ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాశ్మీర్ వ్యవహారంలో సైతం భారత్-పాక్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ ట్రంప్ ముందుకొచ్చారు. దీన్ని భారత్ అప్పట్లో వ్యతిరేకించింది. భారత్, పాక్‌ల మధ్య వ్యవహారమని తోసిపుచ్చింది.













