వివాదంలో ట్రంప్ ప్రచార యాప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల మొబైల్ ప్రచారానికి వినియోగించిన కేంబ్రిడ్జ్ అనలిటికా యాప్ 5 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటాను తస్కరించింది. ఫేస్ బుక్ యూజర్ వివరాలతో ఈ యాప్‌లో లాగిన్‌కు అవకాశం కల్పించడంతో, యాప్ నిర్వాహకులు యూజర్ల ప్రొఫైల్, ఇతర వివరాలను దుర్వినియోగం చేసినట్లు ఫేస్బుక్ అధికారులు గుర్తించారు. దీంతో, ఆ యాప్‌ను ఫేస్బుక్ నుంచి తొలగించారు. కేంబ్రిడ్జ్ అనలిటికాతో పాటు, దాని సృష్టికర్తలైన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టు అలెక్సాండ్ర్ కోగన్, క్రిస్టోఫర్ వైలీ, వారు నిర్వహిస్తున్న సంస్థ యూనోఇయా టెక్నాలజీస్, ఈ యాప్ మాతృసంస్థ స్ట్రాటజిక్ మ్యూనికేషన్ లేబొరేటరీస్ల ఖాతాలను ఫేస్బుక్ నుంచి సప్పెండ్ చేశారు. కేంబ్రిడ్జ్ అనలిటికాకు రూ.97.61 కోట్ల మూలధనం ఉందని, ఈ మొత్తాన్ని రిపబ్లికన్ పార్టీకి విరాళాలిచ్చే కీలక దాత రోబెర్ట్ మెర్సెర్ సమకూర్చాడని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ఎన్నికల ప్రచార సమయంలో స్టీవ్ బెన్నోన్ ఈ యూప్‌ను నిర్వహించే వారని తెలిపింది.













