శృంగార తారతో సంబంధాన్ని తోసిపుచ్చిన ట్రంప్
శృంగార తారతో లైంగిక సంబంధాలున్నట్టు వచ్చిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఈ విషయమై చాలా రోజులుగా వివిధ రూపాల్లో కథనాలు వెలువడుతుండగా, అమెరికా అధ్యక్ష కార్యాలయం తొలిసారిగా స్పందించింది. ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధం ఉండేదని, దానిని బయట పెట్టకుండా ఉండేందుకు ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ 1.30 లక్షల డాలర్లు ఇచ్చి కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని, ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ పోర్న్ స్టార్ స్టెఫనీ క్లిఫర్డ్ కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టులో దావా వేశారు. దీనిపై వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ మాట్లాడుతూ ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారని, ఈ కేసు ఇప్పటికే మద్య వర్తి సహాయంతో పరిష్కారమైందని గుర్తు చేశారు.













