అమెరికాలో ఎమర్జెన్సీ ?
అమెరికాలో అత్యవసర పరిస్థితి విధించే అవకాశముందా? దేశంలో ఏర్పడిన ప్రతిష్టంభన, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి పట్టుదల చూస్తుంటే ఎమర్జెన్సీ తప్పదనిపిస్తోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ట్రంప్‌తో చట్టసభ ప్రతినిధులు జరిపిన చర్చల్లోనూ పురోగతి కనిపించలేదు. దీంతో అధ్యక్షుడు చేతిలో ఉన్న విశేష అధికారమైన ఎమర్జెన్సీ విధించి అమెరికా-మెక్సికో గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ గోడ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్లు కేటాయించాల్సిందేనన్న ట్రంప్ మొండి పట్టుదల, నిధులు కేటాయించేది లేదన్న సీనియర్ డెమోక్రాట్ల బెట్టుతో దేశంలో ప్రతిష్టంభన నెలకొంది. వార్షిక బడ్జెట్‌కు చట్ట సభలో ఆమోదం లభించకపోవడంతో దేశంలోని 8 లక్షల మంది ఫెడరల్ కార్మికులకు డిసెంబరు 22వ తేదీ నుంచి జీతాలు అందడం లేదు. ఫలితంగా దేశంలో నెలకొన్న పాక్షిక షట్‌డౌన్ మూడో వారానికి చేరింది.













