కూచిభొట్ల సునయనకు ట్రంప్ ఆహ్వానం
గత ఏడాది జాతి వివక్ష దాడిలో అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు అరుదైన గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 30న దేశ ప్రజలనుద్దేశించి తొలిసారి కాంగ్రెస్లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సునయనను ట్రంప్ వర్గానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ ఆహ్వానించారు. శ్రీనివాస్ హత్యతో సునయన తన అమెరికా పౌరసత్వాన్ని కోల్పోయారు. కానీ అక్కడే ఉండేందుకు అనుమతి తీసుకున్నారు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయనడానికి సునయన ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా యోడర్ వ్యాఖ్యానించారు. భారత్తో పాటు ఇతర దేశాల నుంచి వలస దారులను ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఇమిగ్రేషన్ సమస్యపై దృష్టిపెట్టినట్టు ఆయన తెలిపారు. కాగా, శ్రీనివాస్ ప్రథమ వర్థంతి సందర్భంగా సునయన త్వరలో భారత్ రానున్నారు.













