ట్రంప్ నా భార్యను కొట్టాడు.. నటుడి సంచలన ట్వీట్
మహిళలను లైంగికంగా వేధించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడని హాలీవుడ్ నటుడు బిల్లీ బాల్డ్ విన్ ఆరోపించారు. మ్యాన్హాటన్లోని ఓ హోటల్లో ట్రంప్ తన భార్య చైనాఫి లిప్స్ పట్ల అనుచితంగా వ్యవహరించాడని తెలిపారు. డెమొక్రాట్ సెనేటర్ అల్ఫ్రాంకెన్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండిస్తూ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ చేసిన వ్యాఖ్యలపై బాల్డ్విన్ స్పందించారు. లైంగిక అక్రమల విషయంలో మీ నాన్నకు ఫిప్త్ డిగ్రీ బ్లాక్‌బెల్ట్ ఉంది. ఒకసారి ప్లాజా హోటల్లో నేను విందు ఇచ్చాను. పిలవకుండానే అక్కడికి వచ్చిన మీ తండ్రి నా భార్యపై చేయి చేసుకున్నాడు. ఆమెను అట్లాంటిక్ నగరానికి హెలికాప్టర్లో తీసుకెళ్తానని ఆహ్వానించాడు. కానీ ఆ కొవ్వు పట్టిన గాడిదకు ఆమె బయటకు వెళ్లే దారి చూపించింది అని ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న దానిపై బాల్డ్విన్ వివరాలు వెల్లడించలేదు.













