అమెరికాకే నష్టం : నాస్కామ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాల జారీని రద్దు చేయడం తప్పుడు నిర్ణయమని నాస్కామ్ పేర్కొన్నది. దీనివల్ల అమెరికాలో కొత్త సమస్యలు ఉత్పన్నమై ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ఓ ప్రకటనలో సృష్టం చేసింది. అమెరికన్లలో ప్రతిభ కొరవడినందున అక్కడి ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చాలా మేరకు విదేశాలకు తరలించే అవకాశమున్నదని నాస్కామ్ అభిప్రాయపడింది. అమెరికాలో అనేక దవాఖానలు, ఫార్మా, బయోటెక్ కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కమ్యూనికేషన్ సంస్థలతో పాటు వేలాది వ్యాపార సంస్థలకు నాస్కామ్ సభ్యులు అత్యవసర సేవలను అందజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.













