హెచ్-1బీ వీసాదారుల భార్యలకు ట్రంప్ షాక్
అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు పనిచేయకుండా నిషేధించే ప్రక్రియను ట్రంప్ సర్కారు వేగవంతం చేసింది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు అధ్యక్షుడికి ప్రతిపాదనలను పంపించింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు (21 ఏళ్ల లోపు) 2015 నుంచి హెచ్-4 వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తోంది. హెచ్-4 వీసాతో భారత మహిళా ఉద్యోగులు అత్యధికంగా ప్రయోజనం పొందారు. కాగా ట్రంప్ తాజా నిర్ణయంతో వీరంతా తమ వీసాలను కోల్పోనున్నారు. దాదాపు 12 లక్షల భారతీయులు నిరుద్యోగులవనున్నారని అంచన. కాగా ఈ ప్రక్రియ అమలవడానికి ఇండా ఏడాది వరకూ సమయం పడుడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.













