మాకు ప్రతిభావంతులైన నిపుణులే కావాలి
ప్రతిభావంతులైన నిపుణులు చట్టబద్ధంగా అమెరికాకు రావాలని కోరుకుంటున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హెచ్1-బీ వీసా కింద అమెరికాకు వస్తున్న ఉన్నతస్థాయి నిపుణుల్లో అత్యధికులు భారతీయులే. కానీ గ్రీన్ కార్డు పొందేందుకు ప్రతి దేశానికి ఏడు శాతం కోటా విధించడంతో భారతీయ నిపుణులు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సభ్యులకు వైట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజన విందు సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తమ ఇమిగ్రేషన్ విధానానికి అర్థం పర్థం లేదని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.













