వలసదారుల సంతానానికి పౌరసత్య హక్కు రద్దు!
అమెరికా పౌరసత్వం లేని దంపతులు, అనధికారికంగా వచ్చి చేరిన వలసదారుల (ఇమిగ్రెంట్లు) సంతానానికి పౌరసత్వం ప్రసాదిస్తున్న రాజ్యాంగపరమైన హక్కును రద్దు చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నద్ధమౌతున్నారు. ఇందుకోసం ఓ అధికారిక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్)ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన విసృష్ట ప్రకటన చేశారు. ఇక్కడికి (అమెరికాకు) వేరే దేశం నుంచి ఎవరైనా వచ్చి బిడ్డను కంటే, ఆ చిన్నారికి అమెరికా పౌరసత్వం దానంతట అదే సంక్రమిస్తుంది. అమెరికా పౌరులకుండే సకల ప్రయోజనాలూ 85 ఏళ్ల పాటు ఆ చిన్నారి అనుభవించగలుగుతుంది. ఈ పద్ధతికి చరమగీతం పలకాల్సిందే అంటూ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో నిష్కర్షగా ఉద్ఘాటించారు.













