డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరం ?
కరోనా బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని వారు అంటున్నారు. ట్రంప్‌నకు కరోనా సోకిన తర్వాత 24 గంటల పాటు ముఖ్యమైన అవయవాలు కలవరపెట్టినట్లు సంబంధిత అధికారి ఒకరు వివరించారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం భిన్నమైన కథనం వినిపిస్తున్నాయి. ట్రంప్ ఆసుపత్రిలో చేరిన తర్వాత గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని, జ్వరం గానీ, శ్వాస ఇబ్బందులు గానీ లేవని వైద్యులు సృష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్‌నకు తొలుత శ్వేతసౌధంలోనే చికిత్స అందించినా తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంతో సృష్టంగా చెప్పలేమని, డిశ్ఛార్జి అయ్యేందుకు కొన్ని రోజుల సమయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రెండ్రోజులు వేచి చూసిన తర్వాతే ఏ విషయమైనా తెలుస్తుందని అంటున్నారు.













