అమెరికాకు ఇయు షాక్
అమెరికా ఇతర దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. తాజాగా అమెరికా ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ (ఇయు) సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తుల్లో బౌర్బన్, జీన్స్, మోటర్సైకిళ్లు కూడా ఉన్నాయి. పెంచిన సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు అమెరికాలో తయారై వచ్చిన ఉత్పత్తులపై సుంకాలు విధించి ధరలను పెంచుతున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలను విధించింది. దీనికి ప్రతిగా 330 కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై బ్రసెల్స్ సుంకాలు విధించింది.













