డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ షాక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ)కు అమెరికా ఇచ్చే నిధులను నిలిపి వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా కట్టడికి సంస్థ పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ సరిగా పనిచేయటం లేదనీ, నిర్వహణపరంగా కూడా లోపాలున్నాయనీ, అందువల్ల సంస్థ పనితీరుపై సమీక్షించాల్సిన అవసరమున్నదని తెలిపారు. వీటితో పాటు చైనాకు అనుకూలంగా సంస్థ ఉన్నదనీ ఆరోపించారు. చైనా ప్రయాణాలపై ముందస్తుగా కట్టడి చేయలేదని ఆయన తప్పుబట్టారు. అమెరికా తరపున సంస్థకు గతేడాది సుమారు 300 కోట్లు సమకూర్చింది. ఇది సంస్థ బడ్జెట్లో 15 శాతం ఉంటుంది.













