మోదీ, ట్రంప్ మధ్య బలమైన సంబంధాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ప్రధాని నరేంద్రమోడీతో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నారని విదేశాంగ అధికార ప్రతినిథి హీథర్ నౌర్ట్ పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాల ప్రామ్యుఖత గురించి ఆమె మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుని కుమార్తె (ఇవాంకా) గత ఏడాది చివర్లో హైదరాబాద్లో జరిగిన సమ్మిట్ సందర్భంగా వచ్చిన అమె అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్లు తనకు తెలిసిందని, దీనిని బట్టి ఒక ముఖ్యమైన సంబంధం, మరింత పటిష్టంగా మారుతోందని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం యొక్క అభివృద్ధి పాత్రను కూడా ప్రశంసించారు. గతంలో కలిసి పనిచేయని దేశాలు, ఇప్పుడు కలిసి పనిచేయడం వల్ల ప్రపంచంలో మార్పులు కనిపిస్తున్నాయని, సౌదీ అరేబియా ఇరాక్ సహాయం చేయనుండటం ప్రపంచం ముందుకు వెళ్తున్న దానికి మంచి ఉదహరణ అని పేర్కొన్నారు.













