ప్రతినిధుల సభ స్పీకర్ కు డొనాల్డ్ ట్రంప్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి షాకిచ్చారు. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడకు నిధుల్ని అడ్డుకుంటున్నందుకు ప్రతీకారంగా అమె బ్రస్సెల్స్, ఈజిప్టు, అఫ్గానిస్తాన్ పర్యటనకు మిలటరీ విమానాన్ని ఇచ్చేందుకు సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో నిరాకరించారు. ఈ మేరకు ట్రంప్ ఆమెకు లేఖ రాశారు. షట్డౌన్ కారణంగా మీ విదేశీ పర్యటన వాయిదా పడింది. షట్డౌన్ ముగిశాక పర్యటనను రీషెడ్యూల్ చేస్తాం. కానీ మీరు ఈ పర్యటనకు ప్రైవేటుగా వెళ్లాలని అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. అమెరికాకు చెందిన 8 లక్షల మందికి పైగా గొప్ప ఉద్యోగులకు 27 రోజులుగా వేతనాలు అందడం లేదన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. మన సరిహద్దుకు అత్యవసరంగా కావాల్సిన భద్రత, నిధుల విషయంలో మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తున్నా అని ట్రంప్ లేఖలో తెలిపారు.













