డొనాల్డ్ ట్రంప్ క్షమాపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాపణలు చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ముగింపు ప్రసంగం ఇచ్చేందుకు ఆయన దావోస్ వెళ్లారు. అక్కడ బ్రిటన్కు చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ముస్లిం వ్యతిరేక వీడియోలను రీట్వీట్ చేసినందుకు గాను క్షమాపణలు కోరారు. వాళ్లు నిజంగా జాత్యాంహకార ప్రజలయితే, ఆ వీడియోలు రీట్వీట్ చేసినందుకు గాను క్షమాపణలు చెబుతానని ట్రంప్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్రిటన్ ఫస్ట్ అనే జాతీయవాద గ్రూపు డిప్యూటీ లీడర్ జైడా ఫ్రాన్సెస్ గతేడాది నవంబర్లో తన ట్విటర్ ఖాతాలో మూడు వీడియోను పోస్టు చేశారు.













