ఆ పెళ్లికి డొనాల్డ్ ట్రంప్ ను ఆహ్వానించలేదు
బ్రిట్రీష్ యువరాజు, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రిన్స్ హారీ వివాహానికి బ్రిటన్ ప్రెసిడెంట్ థెరిసా మేకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆహ్వానం అందలేదు. కారణమేంటంటే ప్రిన్స్ హారీ – మేఘన మార్కెల్‌ల వివాహానికి కేవలం రాజవంశం, మేఘనల కుటుంబాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికి మాత్రమే ఆహ్వానించాలనుకుంటున్నట్లు రాజ ప్రసాదం వారు ప్రకటించారు. రాజకీయ నాయకులేవరిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించలేదని తెలిపారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాకు బ్రిటన్ రాజు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించకుండా ఒబామాను ఆహ్వానించడం బాగుండదనే ఉద్దేశంతో ఒబామాను కూడా ఆహ్వానించలేదు.













