అమెరికాలో కొనసాగుతున్న ఆర్థిక ప్రతిష్టంభన
మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చాల్సిందేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడిన నేపథ్యంలో అమెరికాలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభన ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. శనివారం మొదలైన ఈ సమస్య అదివారం నాడూ కొనసాగింది. క్రిస్మస్ సందర్భంగా కాంగ్రెస్ వాయిదా పడిన నేపథ్యంలో ప్రతిష్టంభన ముగిసే దిశగా ఆశవహ పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సంక్షోభవం కొత్త సంవత్సరంలోకి తర్వాతి కాంగ్రెస్ వరకూ కొనసాగే అవకాశం కనిపిస్తున్నట్టు శ్వేత సౌధం బడ్జెట్ సంచాలకులు మిక్ ముల్వనే పేర్కొన్నారు.













