డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాట
భారత్, పాకిస్థాన్‌లకు చెందిన ఉన్నతస్థాయి నాయకత్వంతో తాను చర్చలు జరపానని, అణ్వాయుధ సామర్థంగల ఆ దేశాల మధ్య కశ్మీర్‌పై నెలకొన్న వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం వస్తానని తెలిపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన భారత ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అయిన ట్రంప్ ఆ సమావేశాల వివరాలను మీడియాకు వెల్లడించారు. కశ్మీర్ అంశంపై ద్వైపాక్షిక సమస్య అని భారత్ పేర్కొంటుండగా, ఆ వివాదాన్ని అంతర్జాతీయం చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా, పాక్ ప్రధానులతో జరిగిన భేటీ ఎంతో ఫలవంతంగా సాగిందని ట్రంప్ తెలిపారు. ఉభయ దేశాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెప్పడం ఇది నాలుగోసారి. ఆ రెండు దేశాల అధినేతలు నాకు మంచి మిత్రులు. అవి రెండు అణ్వాయుధ దేశాలు. అందుకే సమస్యల పరిష్కారానికి ఏదో ఒకటి చేయాలని ఆ ఇద్దరిని కోరాను అని ట్రంప్ తెలిపారు.













