డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకం విధిస్తున్న అమెరికా నిర్ణయాన్ని అనేక దేశాలు తప్పుపడుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా చర్యలు తీసుకోవాలని యూరోప్‌తో పాటు కెనడా, మెక్సికో దేశాలు కూడా కసరత్తు చేస్తున్నాయి. అమెరికాకు గట్టిగా సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో, యురోపియన్ యూనియన్ ఓ పెద్ద లిస్టును తయారు చేసింది. హార్లే డేవిడ్సన్ బైక్‌లతో పాటు అమెరికా నుంచి దిగుమతి అవుతున్న అనేక వస్తువులపై సుంకం విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. దానికి సంబంధించి 10 పేజీల లిస్టును రెడీ చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద కూడా అమెరికా నిర్ణయంపై న్యాయపోరాటం చేయాలని యూరోప్ దేశాలు భావిస్తున్నాయి. తాను తీసుక్ను నిర్ణయాలు అమెరికా స్టీల్ సంస్థలకు రక్షిస్తాయని, దాని ద్వారా జాతీయ భద్రత పెరుగుతుందని ట్రంప్ అన్నారు. ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ తీవ్రంగా తప్పుపట్టారు. దిగుమతులపై సుంకాలు విధించడం అక్రమమని ఆయన అన్నారు.













