ఈబీ-5 వీసాలు రద్దు చేయనున్న అమెరికా!

ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాలను రద్దు చేయాలని అమెరికా భావిస్తున్నది. ఇదో రకంగా భారత్కు చేదు వార్తే. అమెరికాలో కనీసం పది లక్షల డాలర్లను పెట్టుబడి పెడితే, ఆ విదేశీ వ్యాపారికి గ్రీన్ కార్డు జారీ చేస్తారు. అయితే విదేశీయులు ఎక్కువ శాతం పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారని ట్రంప్ సర్కార్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈబీ-5 వీసాలను రద్దు చేయాలా లేక సంస్కరించాలా అన్న అంశాన్ని తేల్చాలంటూ ఉభయసభలను ట్రంప్ సర్కార్ కోరింది. అయితే ఆ దేశంలోని ఉన్నత స్థాయి మంత్రులందరూ ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి ఏడాది అమెరికా సుమారు పదివేల మందికి ఈబీ-5 వీసాలను జారీ చేస్తుంది. ఆ వీసాలను పొందుతున్న వారి లిస్టులో భారత్ మూడవ స్థానంలో ఉంది. మనకంటే చైనా, వియత్నాం దేశాలు ఆ జాబితాలో ముందంజలో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన పెట్టుబడిదారులు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈబీ-5 వీసా వ్వవస్థను రద్దు చేయాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది భారత్ నుంచి 500 మంది ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా 700 మంది భారతీయులు ఈ వీసాకు ఐప్లె చేసుకున్నారు.











































































