అర్హత వుంటే వలస చిన్నారులను కుటుంబాలతో కలుపుతాం
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో తల్లిదండ్రుల నుండి వేరు చేయబడిన ఐదేళ్లలోపు పిల్లలు అన్ని రకాలుగా అర్హలైనట్లైతేే వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ట్రంప్ ప్రభుత్వం అములు చేస్తున్న ఈ వేర్పాటు విధానాలతో విభేదిస్తున్న అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, ప్రభుత్వం తాజాగా చేసిన ఈ ప్రకటనను ఖండించింది. ప్రభుత్వం చేసిన ప్రకటన చాలా అసృష్టంగా వుందన్ని అటార్నీ లీ గెలెరెంట్ వ్యాఖ్యానించారు. ఈ నెల 10 కల్లా ఆ పిల్లలను వారి తల్లిదండ్రులతో కలపాలని శాండియాగో న్యాయమూర్తి విధించిన గడువు కూడా దాటిపోయిందన్నారు.













