ఈ విధానం క్రూరంగా, అసంబద్ధంగా ఉంది : సత్య నాదెళ్ల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తప్పుబట్టారు. ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం క్రూరంగా, అసంబద్ధంగా ఉందని, దాని మార్పును కోరుతున్నామని తెలిపారు. ఆమెరికా వలసదారుల దేశం. మన ఆర్థిక వృద్ది కోసం, మన సమాజాల, కంపెనీల అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆహ్వానిస్తాం. అలాగే అవసరమైన వారికి మన దేశం ఆశాదీపంగా ఉన్నది అంటూ వలస విధానాలపై మైక్రోసాఫ్ట్ సంస్థ వైఖరిని వెల్లడించారు. అమెరికా దక్షిణ సరిహద్దులో శరణార్థులుగా వచ్చిన కుటుంబాల నుంచి పిల్లలను వేరు చేయడం ఓ తండ్రిగా, వలసదారునిగా నన్ను వేదకు గురి చేస్తున్నది అని నాదెళ్ల వ్యాఖ్యానించారు. తాను ఎదుగుతున్న సమయంలో అమెరికా సాంకేతిక పరిజ్ఞానం తనను ఒక కల కనేలా చేసిందని, ఈ దేశ ఇమిగ్రేషన్ విధానం ఆ కలను సాకరం చేసుకునేందుకు సహాయపడిందని పేర్కొన్నారు. మరో దేశంలో ఇది సాధ్యపడేది కాదని తెలిపారు. సరిహద్దుల వద్ద కుటుంబాల నుంచి ప్లిలలను వేరు చేస్తే ప్రాజెక్టులు దేనిలో కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామిగా లేదని నాదెళ్ల సృష్టం చేశారు. వ్యక్తుల గౌరవాన్ని, మానవ హక్కులను పరిరక్షించే వలస విధానాలను మాత్రమే తాము మద్దతునిస్తామని పేర్కొన్నారు.













