హెచ్-4 వీసాదారులకు ఊరట

అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసాలకు సంబంధించి ప్రస్తుతానికి కాస్త ఊరట లభించింది. హెచ్-4 వీసాదారులకు పని అనుమతి రద్దు చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఈ ఏడాది రెండో సారి కూడా డెడ్లైన్ మిస్ అయ్యింది. హెచ్-4 వీసాలకు పని అనుమతి రద్దు చేస్తే ఆ ప్రభావం ముఖ్యంగా భారతీయులపైనే పడుతుంది. హెచ్-1 వీసాలపై అమెరికాలో ఉంటున్న వారి జీవిత భాగస్వాములు, ఎక్కువమంది మహిళలు హెచ్-4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్ ఈ వీసాలను రద్దు చేస్తే చాలా మంది భారత మహిళలు ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది.











































































