పెరూ లో ఎన్నారై తెరాస శాఖను ప్రారంభించిన ఎన్నారై తెరాస కోఆర్డినేటర్ మహేష్ బిగాల
అమెరికా పర్యటన లో భాగంగా తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల సౌత్ అమెరికా ఖండం లోని పెరూ దేశం లో తెరాస ఎన్నారై శాఖను ప్రారంభించారు. ఈ దేశం తో ప్రపంచం లోని అన్ని ఖండాలలో కూడా తెరాస శాఖలు ఏర్పాటు అయ్యాయి అని మహేష్ బిగాల అన్నారు. పెరూ తెరాస శాఖ తెలంగాణా KCR ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకవెళ్తారు అలాగే పెరూ తెలంగాణా బిడ్డలకు తెరాస ప్రభుత్వానికి వారధి గా ఉంది పేరు లో నివసిస్తున్న తెలంగాణా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా పెద్ద అన్నలాగా అండగా ఉంటారని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివ్రుది పనులకు ఆకర్షితులై తెరాస తో ముందుకు నడువాలనుకుంటున్నారు తెరాస ప్రభుత్వాన్నికి అండగా ఉండాలని అనుకుంటున్నారు అని తెలియచేసారు. ఈ సందర్బంగా పేరు లో తాత్కాలిక కమిటీ ని మహేష్ బిగాల నియమించారు. ముఖ్యన్గా గల్ఫ్ బాధితులకు కోసం బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు కేటాయించి ఎన్నారై ల సంక్షేమం కొరకు పాటుపడుతున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వంని మనసా వాచా తెలంగాణా ఎన్నారై ప్రజల తరుపున అభినందిస్తున్నాని అన్నారు.
పెరూ తెరాస కమిటీ సభ్యులు శ్రీ బద్దం పాండు రంగా రెడ్డి గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పెరూ తెరాస శాఖ ఏర్పాటు చేయాలనీ శ్రీ మహెష్ బిగాల గారిని కోరగా పెరూ తెరాస శాఖను ఏర్పాటు చెయ్యడం జరిగింది అని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెరూ తెరాస శాఖ అన్ని విధాలుగా తెరాస పార్టీ కి ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలియచేసారు. సౌత్ అమెరికా ఖండం లో పెరూ తెరాస మొదటి శాఖ కావడం ఆనందంగా ఉందని తెలియచేసారు. ఈ సందర్బంగా తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాళ్ గారికి, నిజామాబాదు ఎంపీ శ్రీ కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేసారు.
పెరూ తెరాస తాత్కాలిక కమిటీ – బద్దం పాండు రంగా రెడ్డి, ఉమా, సందీప్, జనభట్ల శ్రీనివాస్ రావు, మాధవి, రామ్ రెడ్డి, అజయ్ కుమార్. పూర్తి కమిటీ ని అతి తర్వలో ప్రకటిస్తామని మహేష్ బిగాల గారు తెలిపారు. ఎన్నారై తెరాస పెరూ శాఖ ఏర్పాటు చేయడానికి క్రియాశీలకంగా పనిచేసిన శ్రీ చాడ సృజన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.













