ఎన్నారై పాలసీ గురించి సీఎంతో చర్చించాం : మహేశ్ బిగాల
గల్ఫ్ ఎన్నారై పాలసీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించామని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాలకు మహేశ్ బిగాల టీఆర్ఎస్ సభ్యత్వాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ప్రపంచ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 40 దేశాల్లో ఎన్నారైలు ఆన్లైన్లో సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. ఇంకా సభ్యత్వం చేసుకోలేని వారి లిస్టులను సంబంధింత ఎన్నారైలు పంపిస్తే వారి సభ్యత్వ నమోదును పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదుకు ప్రజలు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం సభ్యత్వాల సంఖ్య వివిధ దేశాల్లో పెరుగుతుందని ఆయన తెలిపారు.













