టిఆర్ఎస్ మలేషియా ఎన్నారై శాఖ ప్రారంభం
-ముఖ్య అతిధిగా పాల్గొన్న టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
-ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
-ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చ
-పాల్గొన్న వివిధ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు
-ఫెడరల్ ఫ్రంట్ కి అన్ని వర్గాల మద్దతు
-టిఆర్ఎస్ మలేషియా కమిటీ ఏర్పాటు
-భారీగా చేరికలు
మలేషియా లోని కౌలాలంపూర్ లో టిఆర్ఎస్ పార్టీ మలేషియా శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కోర్ కమిటీ మెంబెర్ చిట్టిబాబు చిరుత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు ముఖ్య అతిధిగా పాల్గొని ఈ శాఖను ప్రారంబించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరుఅయ్యారు. మహేష్ బిగాల పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడిగా చిట్టిబాబు చిరుతని మరియు ఇతర కమిటీని ప్రకటించారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ అందరికి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడి నాలుగు సంవత్సరాలైనా సందర్బంగా మలేషియా లో ఈ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు, గత సంవత్సరం కూడా టిఆర్ఎస్ డెన్మార్క్ ఆధ్వర్యంలో డెన్మార్క్ లో జరిగిన అవతరణ దినోత్సవానికి హాజరయ్యానని గుర్తు చేసారు. ఏప్రిల్ లో జరిగిన ప్లీనరీ లో సీఎం కెసిఆర్ మరియు టిఆర్ఎస్ ఎన్నారై అడ్వైసర్ ఎంపీ కవిత గారి సమక్షంలో ఆడ్ హాక్ కమిటీని ప్రకటించామన్నారు. ఏజెంట్లద్వారా మోసపోతున్న తెలంగాణ వాదులకు ఎంపీ కవిత గారితో చర్చించి సహాయం చేస్తామన్నారు. దీనిపైనా హెల్ప్ లైన్ పెట్టాలని కమిటీ కి సూచించారు. సీఎం కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ పైన ఇంత పెద్ద ఎత్తున చర్చ పెట్టడం పైన సంతోషం వ్యక్తం చేసారు. మలేషియా లోని నాలుగు పార్టీలు కలిసి 92 ఏండ్ల మహాతిర్ మొహమ్మద్ ని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకున్న విధానం ఫెడరల్ ఫ్రంట్ కి మంచి ఉదాహరణ అని అన్నారు.
వివిధ రాష్ట్రాల నుండి చర్చలో పాల్గొనడానికి వచ్చిన వారి అభిప్రాయాలూ సేకరించారు. అక్టోబర్ లో భారీ భహిరంగ సభ ఉంటది దాంట్లో సీఎం కెసిఆర్ గారు పూర్తి అజెండా ప్రకటిస్తారని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పైనా తర్వాత కూడా చర్చలు కొనసాగించి మలేసియాలో ఉన్న భారతీయులందరి మద్దతు కూడగట్టాలన్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ ఎన్నారైలు ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. తెలంగాణాలో అమలవుతున్న నలభై సంక్షేమ పథకాల గురుంచి కూలంకషంగా వివరించారు. ఎన్నారైల సంక్షేమానికి 100 కోట్లు ప్రకటించడం, దీని నుండి 50 కోట్లతో ప్రత్యేక ఎన్నారై సెల్ ని ప్రకటించడంని చుస్తే సీఎం కెసిఆర్ గారికి ఎన్నారైల మీద ఉన్న ప్రేమకు నిదర్శనం అన్నారు. ఎన్నారైలకు వచ్చే రైతుబంధు చెక్ పైన నిర్దిష్ట విధానం త్వరలోనే సీఎం కెసిఆర్ ప్రకటిస్తామన్నారు. ఈ పథకాలను విస్తృతంగా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలనీ టిఆర్ఎస్ మలేషియా కమిటీ ని కోరారు. గత డిసెంబర్ లో జరిగిన తెలుగు మహా సభలకు వంద మంది కి పైగా హాజరు అయ్యినందుకు ధన్యవాదాలు తెలిపారు. మలేషియా తెలుగు అకాడమీ ప్రెసిడెంట్ అచ్చయ్య కుమార్ మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించే ఒకే ఒక్క నాయకుడు సీఎం కెసిఆర్ గారని, ఆయన నాయకత్వం లో వచ్చే ఫెడరల్ ఫ్రంట్ కి మానుండి మద్దతు ఉంటది అన్నారు.
ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ సంఘం ప్రెసిడెంట్ సాయిధమ్ తిరుపతి, తెలుగు అకాడమీ ప్రెసిడెంట్ అచ్చయ్య కుమార్ రావు పాల్గొన్నారు. MYTA అధ్యక్షుడు సాయిదమ్ తిరుపతి గారు, గల్ఫ్ దేశాల్లో, అక్కడ చాలామంది ప్రజలు వీసా సమస్యలపై బాధపడుతున్నారు మరియు మలేషియాలో కూడా. వీరంతా వివిధ ఏజెంట్లు వీసా సమస్య బాధపడుతున్న ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి పూర్తి మద్దతును కోరారు.
టిఆర్ఎస్ మలేషియా కమిటీ వివరాలు:
అధ్యక్షులు:చిట్టిబాబు చిరుత, ఉప అధ్యక్షులు కుర్మా మారుతీ, ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ బొడ్డు తిరుపతి, కోశాధికారి గౌరు రమేష్, ఐటి కార్యదర్శి బోయిని శ్రీనివాస్, ఎక్క్యూటివ్ మెంబెర్స్ తిప్పర్తి అరుణ్ కుమార్, సుంకనపల్లి సుమన్ భరత్, గద్దె జీవన్, సత్యనారాయణరావు నాదిపల్లి, అడ్వైసర్ మెంబెర్ గా రవీందర్ రెడ్డి ఎన్నిక అయ్యారు.













