లండన్ లో టీఆర్ఎస్ ప్రచార విభాగం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడంతో లండన్ లోని తెలంగాణ పౌరులంతా టీఆర్ఎస్కు అనుబంధంగా ప్రచార విభాగాన్ని ఏర్పాటు చేశారు. టిఆర్ఎస్ మిషన్ పేరుతో పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల చేతుల మీదుగా ఇటీవల వినూత్న ప్రచారాన్ని ప్రారంభోత్సవం జరగ్గా ఇప్పుుడు విస్తృతంగా లండన్‌లోని తెలంగాణ పౌరులచెంతకు తీసుకెళ్ళడానికి ప్రత్యేక విభాగాన్నే ప్రారంభించారు. ఇందుకోసం ఒక కార్యాలయాన్ని అక్కడ నెలకొల్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళలో అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించడం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశ స్థాయిలో తీసుకొచ్చిన గుర్తింపు తదితరాలన్నింటినీ ఈ విభాగం ద్వారా ప్రచారం చేయనుంది.
లండన్ నుంచే తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ ద్వారా వివరించి టీఆర్ఎస్ గెలపు కోసం ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించనున్నారు. ఈ ప్రచారా కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, పార్టీ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సందర్భంగా జరిగిన ఉద్యమంలో టీఆర్ఎస్ యుకె విభాగం క్రియాశీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ లండన్‌లో విభాగంతో కలిసి పనిచేస్తుందని వివరించారు.













