మాల్టా లో తెరాస శాఖ
-ప్రారంభించిన మహేష్ బిగాల
-10వ అతి చిన్న దేశంలోనూ టిఆర్ఎస్ పాగా
-38కి చేరిన ఎన్నారై శాఖలు
యూరోప్ లోని మాల్టా దేశంలో తెరాస శాఖని గురువారం స్కైప్ ద్వారా టిఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రారంభించి ఆడ్ హాక్ కమిటీని ప్రకటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 5లక్షల జనాభా ఉన్న మాల్టా లాంటి చిన్న దేశంలోను సీఎం కెసిఆర్ గారికి అభిమానులు ఉండడం, ఇక్కడ శాఖని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. దీనితో విదేశాలలో తెరాస శాఖలు 38 కి చేరుకున్నాయి అని తెలిపారు. ఎంపీ కవిత తో చర్చించి పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తామని తెలిపారు. ఆడ్ హాక్ కమిటీ సభ్యులుగా అనుమండ్ల మధూకర్ రెడ్డి, శ్రీకాంత్ బ్రమ్మదండి, గంగారెడ్డి, కొండల్ రెడ్డి లోక, హరీష్ పాటిల్, శ్రీకాంత్ గౌడ్, రాజారెడ్డి నోముల, కీర్తినాథ్, రాజేష్ రెడ్డి, అఖిల్ ఎన్నికయ్యారు.













