18న మిచిగాన్‌లో దీపావళి వేడుకలు
మిచిగాన్‌లో ఈ నెల 18న దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ట్రాయ్ తెలుగు అసోసియేషన్, మిచిగాన్ ఆధ్వర్యంలో జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు నిర్వాహకులు వెంకటేష్ బాబు, ప్రసాద్ గంగిసెట్టి, సురేష్ చోలవీటిలు పత్రికా ప్రకటనలో విడుదల చేశారు. లాంఫర్ హైస్కూలులో శనివారం మద్యాహ్నం 3 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, దీపావళి వేడుకలు ప్రారంభం అవుతాయని నిర్వహకులు తెలిపారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు విందు ఉంటుందన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహకులు దీపావళి వేడుకులకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.













