అమెరికాలో అరుదైన సంఘటన
వాళ్లు ముగ్గురూ అక్కాచెళ్లెళ్లు. ఒకే రోజు ఒకే ఆసుపత్రిలో ప్రసవించారు. వీరి ముగ్గురికీ ఒకే డాక్టర్ కాన్పు చేశారు. ఈ అరుదైన సంఘటన అమరికాలో చోటు చేసుకుంది. ఆస్లే హయ్నెస్, దనీషా హయ్నెస్, ఎరియల్ వియమ్స్ జులై 3న ఒహియా మ్యాన్స్ ఫీల్డ్ ఆసుపత్రిలో చేరారు. సిజేరియన్ ద్వారా ఒకేసారి ప్రసవించాలని అనుకున్నారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో, నాలుగున్నర గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రసవించారు. ఆస్లేకు మగ బిడ్డ జన్మించగా, మిగతా ఇద్దరు ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.













