నమో.. అమెరికా…
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనపై ప్రఫంచనేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడన్ దంపతుల ప్రత్యేక ఆహ్వానంపై మోదీ… అమెరికాలో పర్యటించనున్నారు. ఈపర్యటనలో డిఫెన్స్ డీల్స్ పైనా చర్చలు జరగనున్నాయి. మరీ ముఖ్యంగా తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఇంజిన్ల తయారీపై ఒప్పందాలు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇటీవలికాలంలో పెరుగుతున్న డ్రాగన్ కవ్వింపుచర్యలు, అంతర్జాతీయ పరిణామాలపైనా చర్చించే అవకాశముంది..మరీ ముఖ్యంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత ఉన్నతస్థాయికి చేరనున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు.
అమెరికాలో న్యూయార్క్లో మోదీ పర్యటన ప్రారంభం కానుంది.న్యూ యార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోదీ నాయకత్వం వహించనున్నారు. 22న అమెరికా దేశ అధ్యక్షుడు బైడెన దంపతులతో సాయంకాల విం దులో పాల్గొంటారు. అదే రోజున అమెరికా చట్టసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్, విదేశాంగ మంత్రి ఆంటో నీ బ్లింకెన ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు.
మోదీ అమెరికా పర్యటన సందర్భంగా .. భారతప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు ప్రవాసభారతీయులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ ప్లాజాలో మోదీ రాక సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మోదీకి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వనం పలకనున్నారు. ఈసందర్భంగా మోదీ.. ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. వారితో సెల్ఫీలు దిగనున్నారు.
మరోవైపు మోదీ రాకకోసం ఎదురుచూస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా ఓ భారతప్రధానికి అపూర్వస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిణామాలను ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు కంట్రీ చైనా.. మోదీ టూర్ ను నిశితంగా గమనిస్తోంది.ఇప్పటికే తమకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమి, సంయుక్త నావికా విన్యాసాలను అమెరికా, భారత్ కొనసాగిస్తుండడంతో… ఈపర్యటనలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయా అన్న అంశంపై ఆసక్తి ప్రదర్శిస్తోంది.






