TANA: తానా 24వ మహాసభల్లో రామోజీ రావుకు నివాళులు
తానా (TANA) 24వ మహాసభల్లో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన తెలుగు వారిని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, సినీనిర్మాత, మీడియా మొగల్ రామోజీరావును కూడా డెట్రాయిట్ వేదికగా జరుగుతున్న తానా మహాసభల్లో స్మరించుకున్నారు. ‘రామోజీ ఫిలిం సిటీ’ వంటి సినీ ప్రపంచాన్ని నిర్మించిన రామోజీ జీవితంలోని పలు కీలక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలను ఏవీ రూపంలో ప్రదర్శించారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీ రావు.. ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానెల్‌తో తెలుగు ప్రజల జీవితాలతో విడదీయలేని అనుబంధం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో రామోజీరావుకు ఉన్న అనుబంధాన్ని చూపించే చిత్రాలను కూడా తానా 24వ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. ఈ వీడియో ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రథమ వర్ధంతి జరుపుకున్న రామోజీ రావుకు తానా మరోసారి నివాళులు అర్పించింది.







