మేరీల్యాండ్ లో వైఎస్సార్ సేవలను స్మరించుకున్న అభిమానులు
ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఫ్రెడెరిక్ నగరంలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమై తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ అభిమానులు, కార్యకర్తలు సమావేశమై ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ, ఆంధప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది అయన పరిపాలన, పధకాలు, అభివ•ద్ధి. ఈ మూడు సమంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత కేవలం ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు వెంకట్ యర్రం, రాజశేఖర్ యరమల, రాంగోపాల్ దేవపట్ల, మురళి బచ్చు, శ్రీనివాస్ పూసపాటి, నాగిరెడ్డి, లోకేష్ మేడపాటి, సోమశేఖర్ పాటిల్, పూర్ణ శేఖర్ జొన్నల, లక్ష్మి నారాయణ, రామక•ష్ణ, శ్రీధర్ వన్నెంరెడ్డి, సాయి జితేంద్ర లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.













