చికాగోలో ఘనంగా ట్రైస్టేట్ తెలుగు సంఘం సంక్రాంతి వేడుకలు
చికాగోలో ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జనవరి 28న స్థానిక హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో లామోంట్ ఆలయ ప్రాంగణంలో సంస్థ అధ్యక్షులు హేమంత్ పప్పు, ఎగ్జిక్యూటివ్ టీం స్వప్న పులా, సోమలత యనమందల, మధు ఆరంబాకం మరియు భాను సీరం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ప్రణతి కలిగొట్ల ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరించగా, చిన్నారులు, పెద్దలు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ అన్ని వయస్సుల వారు పాల్గొని, తెలుగు సంస్కృతి ని ప్రతిఫలించే సంగీత , నాట్య కార్యక్రమాలతో పాటు, చిత్ర గీత నృత్యాలు మరియు పాటలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి టిటిఎ బోర్డ్ చైర్మన్ వీరాస్వామి ఆచంట, జగదీశ్ కానూరు, శ్రీనాథ్ వాసిరెడ్డి, హేమచంద్ర వీరపల్లి, రామకృష్ణ కొర్రపోలు, ప్రసాద్ మరువాడ, దిలీప్ రాయలపూడి , గుప్త నాగుబండి, అపర్ణ అయ్యలరాజు, ప్రశాంతి తాడేపల్లి, దీప్తి చిరువూరి, రవి వేమూరి ఎంతో తోడ్పడ్డారు. కేకే రెడ్డి, అశోక్ లక్ష్మణ్, సాయి రవి సూరిభొట్ల, రాజ్ పొట్లూరి మరియు రమేష్ నాయకంటి ఈ కార్యక్రమానికి విచ్చేసారు. ఈ కార్యక్రమానికి ‘తానా’ సభ్యులు హేమ కానూరు, కాశి పాటూరి, కృష్ణ మోహన్ చిలమకూరు, రవి కాకర, చిరు గళ్ళ, శ్రీహర్ష గరికపాటి, ఉమా కటికి, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీనివాస్ అట్లూరి తదితరులు హాజరయ్యారు.







