ప్రపంచంలో తొలి అద్భుత వింత
ప్రపంచంలో తొలిసారిగా 30ఏళ్ల లింగమార్పిడి మహిళ బిడ్డకు చనుబాలిచ్చింది. గమనించాల్సి విషయం ఏమిటంటే ఆ లింగ మార్పిడి మహిళ బిడ్డకు జన్మనివ్వలేదు. డిఐవై హార్మోన్ల థెరపి ద్వారా డాక్టర్ ఆమె చనుబాలు పట్టేలా హర్మోన్ల స్థాయి పెంచారు. దాంతో ఆమె చనుబాలు పట్టేందుకు అర్హత సాధించింది. డెయిలీ మెయిల్ దినపత్రిక కథనం ప్రకారం వక్షోజాలా పెంపు, వెజినోప్లాస్టి వంటి శస్త్రచికిత్సలు ఏవి చేయించుకోకుండానే ఆ లింగ మార్పిడి మహిళ బిడ్డకు చనుబాలు పట్టింది. ఈ అద్భుతాన్ని న్యూయ్కార్లోని మౌంట్ సినాయి సెంటర్ ఫర్ ట్రాన్స్ జెండర్ మెడిసిన్ అండ్ సర్జరీలో డాక్టర్ టామర్ రెసిమాన్ సాధించారు. ఆయన కెనడా నుంచి తెప్పించిన హార్మోన్ డోస్‌లను లింగమార్పిడి మహిళకు బిడ్డ పుట్టడానికి మూడు నెలల ముందు ఇచ్చారు. ఆమె డాక్టర్‌తో తన అనుభవాన్ని పంచుకుంది. దీంతో లింగమార్పిడి వ్యక్తుల వైద్యంలో ఇదో ప్రగతి అంటూ డాక్టర్ సంబరపడిపోయాడు. ఆమె కథనంలో ట్రాన్స్‌జెండర్ హెల్త్ పత్రికలో ప్రచురితమైంది. లింగ మార్పిడి పొందిన మహిళ ప్రేరేపిత చనుబాలును బిడ్డకు పట్టడం అనేది ఇదే తొలి అధికారిక నివేదిక అంటున్నారు. దీంతో లింగమార్పిడి మహిళలు గర్భం దాల్చడం, ప్రసవించడం, చనుబాలుపట్టడం వంటివన్నీ సాధించొచ్చని డాక్టర్ల బృందం అభిప్రాయపడింది.













