అమెరికాలో ఘోర ప్రమాదం
అమెరికాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరిజోనాలోని టెంపె టౌన్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. భారీ మంటలకు బ్రిడ్జి కొంత భాగం కాలి కూలిపోయింది. రైలు పట్టాలు తప్పి అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పొగలు కమ్మేయడంతో గాలి పీల్చుకోలేక మరికొంతమంది ఇబ్బందిపడ్డారు. మొత్తంగా 10 గూడ్స్ బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 90 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితులకు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు.













