Suguna Reddy: సుగుణరెడ్డికి ‘‘ట్రైల్బ్లేజర్ ఉమెన్’’ అవార్డు
అమెరికాలోని కాలిఫోర్నియాలో టీవీ9 ప్రతినిధిగా సేవలందిస్తున్న సుగుణ రెడ్డి(Suguna Reddy) కి అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో టీవీ మీడియా రంగంలో సుగుణ రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ‘‘ట్రైల్బ్లేజర్ ఉమెన్’’ అవార్డు (Trailblazer Women Award) కు సుగుణరెడ్డిని ఇండో అమెరికన్ల సంఘం ఎంపిక చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ అవార్డును ఆమెకు శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డి అందజేశారు. వరంగల్ కు చెందిన సుగుణ రెడ్డి 14 సంవత్సరాలకుపైగా జర్నలిజంలో ఉన్నారు. మహిళలకోసం ఏర్పాటైన ‘వేటా’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.







