టీపీఏడీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు

అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజా సమితి (టీపీఏడీ) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కామెరికా సెంటర్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21న ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని టీపీఏడీ కోరుతోంది.