టీపీఏడి బతుకమ్మ సంబరాల్లో మెరవనున్న హీరోయిన్ సంయుక్త మీనన్

అమెరికాలోని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరగనున్నాయి. అక్టోబర్ 21న జరిగే ఈ వేడుకల్లో సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా పాల్గొంటారు. టెక్సాస్‌లోని కామెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరీనా) వేదికగా ఈ బతుకమ్మ, దసరా వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో ప్రముఖ సింగర్లు తమ పాటలతో అందర్నీ అలరించనున్నారు. ఏటా ఘనంగా జరిగే ఈ వేడుకల్లో ప్రతియేడూ 10 వేల మందికిపైగా తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా ఈ బతుకమ్మ, దసరా వేడుకలు విజయవంతం చేయాలని తెలుగు వారిని టీపీఏడీ కోరుతోంది.