TPAD Bathukamma & Dasara Sambaralu 2019
డాలస్ తెలంగాణ ప్రజాసమితి (TPAD):
ప్రతీ సంవత్సరం సద్దుల బతుకమ్మ మరియు దసరా సంబరాలు జరిపే ముందు ఈ వేడుకలలో భాగమైనట్టి బొడ్డెమ్మ, చిన్న బతుకమ్మ (ఎంగిలిపూలు) సాంప్రదాయకంగా జరుపడం TPAD సంస్థ ఆనవాయితి.
భాద్రపద మాసం పంచమి(September 19) రోజు బొడ్డెమ్మ వేడుకలు జరిపారు. మహాలయ అమావాస్య రోజు వొచ్చే శుక్ర వారం (September 27) చిన్న బతుకమ్మను (ఎంగిలిపూలు) జరుపుతున్నారు.
ఇద్దరక్క చెల్లులు ఉయ్యాలో – TPAD కొచ్చె ఉయ్యాలో
డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఉయ్యాలో – దోస్తులంతా కూడి ఉయ్యాలో||
ఫ్రిస్కో నుండి ఉయ్యాలో – ప్లెనో నుండి ఉయ్యాలో
ఇర్వింగూ నుండి ఉయ్యాలో – కొప్పెల్లో నుండి ఉయ్యాలో
ఫ్లవర్ మాండ్ నుండి ఉయ్యాలో – సౌత్ లేక్ నుండి ఉయ్యాలో||
నగర నగరము నుండి ఉయ్యాలో – TPAD బతుకమ్మ ఉయ్యాలో
పంపెనే ఆహ్వానం ఉయ్యాలో – చిన్న బతుకమ్మకు ఉయ్యాలో||
అక్క చెల్లెళ్ళరా ఉయ్యాలో – అందుకో ఆహ్వానం ఉయ్యాలో
పేస్ బుక్ ల్లోనూ ఉయ్యాలో – వాట్స్ ప్పు ల్లోనూ ఉయ్యాలో
మహిళ లందరికిదే ఉయ్యాలో – TPAD ఆహ్వానం ఉయ్యాలో||
వొచ్చే శుక్రవారం సెప్టెంబర్ 27 సాయంత్రం 6.30 PM
Andrew Brown Park East, 260 Parkway Blvd, Coppell, TX 75019.













